'ఆన్ సైట్ FIR విధానంతో సులభంగా పోలీస్ సేవలు'

'ఆన్ సైట్ FIR విధానంతో సులభంగా పోలీస్ సేవలు'

ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా పోలీస్ సేవలను అందించేందుకు "ఆన్ సైట్ FIR ” విధానాన్ని అమలు చేస్తున్నామని SP నితికా పంత్ మంగళవారం తెలిపారు. హత్యాయత్నం, అత్యాచార యత్నం, దోపిడీ, మహిళలు, చిన్నారులపై నేరాల ఘటనల్లో బాధితులు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేకుండా, వారు ఉన్న ప్రదేశానికే వెళ్లి పోలీసు అధికారులు FIR నమోదు చేస్తారన్నారు.