'చెరువులో మృతదేహం లభ్యం'

'చెరువులో మృతదేహం లభ్యం'

భూపాలపల్లిలోని జవహర్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న బొబ్బు గడి చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు ఆకుపచ్చ టీషర్టు, నలుపు రంగు లోయరు, ఎరుపు రంగు ఫుల్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. అతనికి తెలుపు గడ్డము, తెల్లటి వెంట్రుకలు ఉన్నాయి. మృతుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే 8712658120, 8712658121, 8712658142 నంబర్లలో సంప్రదించాలని భూపాలపల్లి ఎస్సై తెలిపారు.