విస్సన్నపేటలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

NTR: విస్సన్నపేటలో బుధవారం రాత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ.. ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.