పట్టణంలో జీసెస్ ఫర్ రన్
SRD: పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి సీఎస్ఐ చర్చి వరకు యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో జీసెస్ ఫర్ రన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చర్చి నిర్వాహకులు తెలిపారు.