VIDEO: సాగర్ కాలువకు భారీ గండి

KMM: వేంసూరు మండలం కుంచపర్తిలో సాగర్ కాలువకు భారీగా గండి పడింది. దీంతో కాలువలోని నీళ్లు సమీపంలోని చెరువులోకి చేరుకుంటున్నాయి. సరైన సమయానికి దిగువన ఉన్న లాకులు ఎత్తకపోవడంతో కాలువకు గండి పడినట్లు రైతులు తెలుపుతున్నారు. అయితే కాల్వకు గండిపడి పెద్ద మొత్తంలో నీరు చెరువులోకి చేరుకోవడంతో చెరువు ఆయకట్టు భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.