నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
ADB: నేరడిగొండ మండలంలో ఇవాళ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని మంగళవారం విద్యుత్ శాఖ ఏఈ నాగేంద్ర ప్రసాద్ రావు పేర్కొన్నారు. ఈ క్రమంలో 33/11 కేవి సబ్ స్టేషనులో మరమ్మతు కారణంగా ఉదయం 11 గం.ల నుంచి మధ్యాహ్నం 4 గం.ల వరకు సరఫరా నిలిపివేయనున్నామని తెలిపారు. కాగా, కరెంటు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.