బాధిత కుటుంబానికి చేయూత అందజేసిన జిల్లా SP

బాధిత కుటుంబానికి చేయూత అందజేసిన జిల్లా SP

VZM: జిల్లా పోలీసుశాఖలో AR HC గా పని చేసిన నర్సింహ పట్నాయక్ ఇటీవల అనారోగ్యతో మృతి చెందారు. వారి కుటుంబానికి చేయూతగా పోలీసు అధికారులు,సిబ్బంది అందించిన 1,48,600రూ చె‌క్‌ను అతని భార్య స్వర్ణలతకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం అందజేశారు. మరణించిన పోలీసు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయూత అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.