ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 14 మందికి జరిమానా

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 14 మందికి జరిమానా

TPT: తిరుపతి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడిన 14 మందికి 4వ అడిషనల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ రూ.1.40 లక్షలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి తెలిపారు. ఈ మేరకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున 14 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు. అందులో ఆటో డ్రైవర్లకు ఇద్దరికి రెండు రోజులు, ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.