బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్: మైపాల్
VKB: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మైపాల్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్నేపల్లి చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సరైన పాలన సాగి, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని ఆయన తెలిపారు.