భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

TG: ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో మంగపేటలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారంలో 16 సెంటీమీటర్లు, వెంకటాపురంలో 12 సెం.మీల వర్షపాతం రికార్డయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.