'స్మార్ట్ స్ట్రీట్ బజార్' పనులు వేగవంతం: నందన్

NLR: వీధి వ్యాపారుల ఆర్థిక అభ్యున్నతి కోసం పైలెట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న 'స్మార్ట్ స్ట్రీట్ బజార్' ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారులు, మెప్మా విభాగం అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు.