'మహిళల ఆర్ధిక ఎదుగుదల ముఖ్యం'
SKLM: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం స్వయం సహాయక సంఘం సభ్యుల కోసం నిర్వహించిన సూక్ష్మ వ్యాపారాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు.