చింతపల్లి సంత షెడ్లు చెత్తకుప్పగా
ASR: చింతపల్లిలో లక్షల రూపాయలతో నిర్మించిన సంత షెడ్లు నిర్లక్ష్యంతో చెత్తకుప్పగా మారాయి. రాత్రివేళల్లో మద్యం సేవించే వారి అడ్డాగా మారి, ఖాళీ సీసాలు, వ్యర్థాలతో నిండిపోయాయి. పారిశుద్ధ్యం లేక రైతులు షెడ్లలో కాకుండా రోడ్ల పక్కనే వ్యాపారం చేస్తున్నారు. పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ శుభ్రతపై పంచాయతీ నిర్లక్ష్యం కొనసాగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.