న్యాయవాది ఎల్లయ్య హత్యపై నిరసన
PLD: సత్తెనపల్లిలో బుధవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. పీలేరుకు చెందిన యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య దారుణ హత్యను వారు తీవ్రంగా ఖండించారు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కోర్టు ఆవరణలోని న్యాయదేవత విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దొంగలను పట్టించాడనే కక్షతోనే ఈ హత్య చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.