రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని కొత్తూరు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుదురుగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.