శ్రీముఖలింగం ఏర్పాట్లు పరిశీలన
SKLM: ఈ నెల 15 మహాశివరాత్రి పర్వదినం నుంచి నాలుగు రోజులు పాటు జరిగే శ్రీముఖలింగం ఉత్సవ ఏర్పాట్లను జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ డీ.పృథ్వీరాజ్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దర్శనం కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లు ఇతర అవసరాలను పరిశీలించారు. చక్కర తీర్ధ స్నానానికి వెళ్లే రహదారి స్వయంగా పరిశీలించారు. ఆయనతో ఆర్డీవో సాయి ప్రత్యూష ఉన్నారు.