VIDEO: పస్రాలో అర్ధరాత్రి ఇసుక లారీలు ఢీ
MLG: పస్రా కోటగడ్డ క్రాస్ వద్ద గురువారం అర్ధరాత్రి ఇసుక లారీలు ఢీకొన్నాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి లారీ ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ రాజేష్ కేబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ తాజుద్దీన్ ఘటనాస్థలికి చేరుకుని రాజేష్‌ను వెలికితీశారు. మరో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.