అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. MRO కృష్ణ ఆధ్వర్యంలో జేసీబీతో సిబ్బంది నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.