తురకపాలెంలో పర్యటించనున్న రాష్ట్ర వైద్య బృందం

తురకపాలెంలో పర్యటించనున్న రాష్ట్ర వైద్య బృందం

గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో రాష్ట్ర వైద్య బృందం త్వరలో పర్యటించనుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. డీఎంఈ డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో వైద్య బృందం పర్యటించి, తురకపాలెంలో ఫీవర్, ఇన్ఫెక్షన్ కేసుల్ని పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం మంత్రికి రాష్ట్ర బృందం నివేదిక ఇవ్వనుంది.