రూ.5 లక్షల ఖర్చు.. అభ్యర్థికి షాక్

రూ.5 లక్షల ఖర్చు.. అభ్యర్థికి షాక్

WGL: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో సర్పంచ్ కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. ఇక్కడ 8 మంది పోటీ చేయగా, ఓ స్వతంత్ర అభ్యర్థి 550 మందికి ఒక్కో ఓటుకు రూ.వెయ్యి చొప్పున రూ.5 లక్షలకు పైగా పంచినా అతడికి 55 ఓట్లే రావడంతో షాక్ అయ్యాడు. తనకు ఓటేయలేదని ఉదయం నుంచే గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వసూలు చేస్తున్న వార్త గ్రామంలో హాస్యంగా మారింది.