VIDEO: గ్రామ అభివృద్ధికి హామీ ఇచ్చిన నూతన పాలక వర్గం
KMM: పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామపంచాయతీలో కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. నేలకొండపల్లి MPDO ఎర్రయ్య నూతన సర్పంచ్ రావెళ్ల జ్యోతి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ప్రమాణస్వీకారం చేయించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను గుర్తించి మెరుగైన పాలన అందిస్తామని నూతన పాలక వర్గం తెలిపింది.