సీఎం పర్యటన.. ముందస్తు అరెస్ట్

సీఎం పర్యటన.. ముందస్తు అరెస్ట్

BDK: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చండ్రుగోండ మండలం బెండాలపాడు పర్యటన నేపథ్యంలో సీపీఎం నాయకులను పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారన్న కారణంతో నోటీసులు ఇచ్చారు. తెల్లవారుజామునే వారిని అరెస్ట్‌ చేసి కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ అయిన వారిలో నాయకులు భూక్యా రమేష్, తదితరులు ఉన్నారు.