'మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మిర్చి పంటలు వైరస్‌లు, వేరు కుళ్లు, నల్లితోట దెబ్బతినడంతో రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభావిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏన్కూరు మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం సోమవారం పంటలు పరిశీలించగా, తీవ్ర నష్టం స్పష్టమైందని నాయకులు పేర్కొన్నారు.