రేషన్ షాప్ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

SRD: నారాయణఖేడ్ పట్టణంలో రేషన్ షాప్ నంబర్.53 ను సబ్ కలెక్టర్ ఉమా హారతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు రేషన్ సరుకుల పంపిణీ, స్టాకును, ఈ పాస్ మిషన్ పరిశీలించారు. ఈ షాప్ పై విచారణ జరిపి తుది నివేదిక సమర్పించాల్సిందిగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్‌ను ఆమె ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి రేషన్ షాప్‌లో సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు.