హక్కులను రక్షించుకోవడానికి సార్వత్రిక సమ్మె

MNCL: కార్మికులు సాధించిన హక్కులను రక్షించుకోవడానికి మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెను చేయనున్నామని సిఐటియు జన్నారం మండల అధ్యక్షులు అంబటి లక్ష్మణ్ కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొనాలని కోరారు.