VIDEO: పుంగనూరులో భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు

VIDEO: పుంగనూరులో భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు

CTR: పుంగనూరు పట్టణంలో శనివారం బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. స్థానిక పోస్టాఫీస్ నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు ర్యాలీగా NS పేటలోని ఈద్గా వద్దకు చేరుకున్నారు. అనంతరం సామూహికంగా ప్రార్థనలు చేశారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని మత గురువులు వివరించారు. తర్వాత ఖబరస్తాన్‌లోని తమ పూర్వికుల సమాధుల వద్దకు వెళ్లి నివాళి అర్పించారు.