తుమ్మల చెరువులో ఎడ్ల పందేల పోటీలు

తుమ్మల చెరువులో ఎడ్ల పందేల పోటీలు

ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో సయ్యద్ హజరత్ ఖాసీం స్వామి పీర్ల పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీనియర్ ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూలై 6వ తేదీ నిర్వహిస్తున్న ఈ పోటీలలో గెలుపొందిన ఎడ్ల జతలకు ఐదు బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. బహుమతులు రాని జతకు 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.