VIDEO: 'గుంతలమయమైన రహదారికి మరమ్మతులు చేయాలి'
MNCL: కాసిపేటలోని 3వ వార్డులో ఉన్న ప్రధాన రహదారి గుంతలమయమై దుమ్ము ధూళితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే వాహనాలు టోల్ టాక్స్ తప్పించుకునేందుకు ఈ దారిలో ప్రయాణిస్తున్నాయన్నారు. దీంతో రోడ్డు మొత్తం నాశనమైందని, పలుమార్లు MLAకు సమస్య విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు.