విద్యార్థుల మధ్య మాదిరి ఎన్నికల ఉత్సాహం

విద్యార్థుల మధ్య మాదిరి ఎన్నికల ఉత్సాహం

NRPT: ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్ధంపూర్ ప్రాధమిక పాఠశాలలో మోక్ పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో శివశంకర్, భూమిక, శివాని అభ్యర్థులుగా పోటీ చేయగా విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి అవ్వగానే ఓట్ల లెక్కింపు నిర్వహించడంతో శివశంకర్ విజేతగా నిలిచాడు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించారు.