గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాల్‌టికెట్లు విడుదల
KKD: తుని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ విశ్వశాంతి తెలిపారు. ఏప్రిల్ 12న నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు ఈ పరీక్ష అత్యంత కీలకమన్నారు.