నందికొట్కూరులో AISF కరపత్రాల ఆవిష్కరణ

KRNL: నందికొట్కూరులో సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. జూలై 8, 9, 10వ తేదీలో జరిగే ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతుల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపైన ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని అన్నారు.