'రామాయంపేటలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి'

'రామాయంపేటలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి'

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోని పదో వార్డులో త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన స్థానికులు ప్రభుత్వం వెంటనే త్రాగునీరు సరఫరపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.