VIDEO: పప్పు నీళ్లే కూర.. ఆకలితో ఆశ్రమ విద్యార్థులు!

VIDEO: పప్పు నీళ్లే కూర.. ఆకలితో ఆశ్రమ విద్యార్థులు!

MDK: కౌడిపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. 172 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా, పప్పులో నీళ్లు కలిపి వడ్డిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం సరిగా లేక చాలామంది బిస్కెట్లు తింటూ కాలం గడుపుతున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.