తాగునీటితో కారు శుభ్రం.. రూ. 10 వేల జరిమానా
HYD:తాగునీటిని వృథా చేసినందుకు ఓ వ్యక్తికి జలమండలి ఎండీ ఆశోక్ రెడ్డి ఆదేశాలతో రూ. 10వేల జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్లో చోటు చేసుకుంది. నారాయణ అనే వ్యక్తి తాగునీటితో వాహనాలు శుభ్రం చేసినట్లు గుర్తించి ఫైన్ విధించినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని ఎవరు వృథా చేసినా చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.