వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయకూడదు: కలెక్టర్

JN: నిరుపేదలకు వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం కలెక్టరెట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి సేవలతో పాటు డెలివరీలు నెలకు 50కి తగ్గకుండా చూడాలన్నారు.