రైళ్లలో అర్ధరాత్రి రెచ్చిపోతున్న దొంగలు..!

రైళ్లలో అర్ధరాత్రి రెచ్చిపోతున్న దొంగలు..!

PLD: ఉమ్మడి జిల్లాలో రైళ్లలో అర్ధరాత్రి నుంచి వేకువజాము మధ్య దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా పల్నాడు, బాపట్ల ప్రాంతాల్లో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నిలువు దోపిడీలు చేస్తున్నారు. భద్రత సిబ్బంది కొరతతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గుంటూరు డివిజన్‌లో తక్కువ రైళ్లకే ఎస్కార్ట్ ఉండటం సమస్యగా మారింది. తాజాగా, అర్థరాత్రి బెంగళూరు-నరసారావుపేట రైలును నిలిపివేశారు.