విద్యుత్ షాక్‌తో రైతు మృతి
NGKL: కోడేరు మండలం గుండియా వాల్యా నాయక్ తండాలో విద్యుదాఘాతంతో కాట్రావత్ లోకారం నాయక్(39) అనే రైతు మృతి చెందారు. ఆదివారం ఉదయం తన మొక్కజొన్న పొలంలో బావి మోటార్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా, విద్యుత్ తీగ తెగి కాలుకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.