VIDEO: ఈడికిపల్లె సమీపాన కొండకు కారు చిచ్చు
CTR: పుంగనూరు(మం) ఈడిగపల్లె సమీపానగల కొండలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. కొండకు కారు చిచ్చు అంటుకుంది. కొండ వద్ద గల పంట పొలాల్లోకి మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందజేశారు. కొండ సమీపాన ఉన్న ప్రజలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.