అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

MBNR: అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో గురువారం జరిగింది. మాచన్పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, చిత్రహింసలకు గురి చేసి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.