రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

MBNR: కదులుతున్న రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జడ్చర్ల ఆలూరు రైల్వే గేట్ వద్ద చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై అక్బర్ తెలిపిన వివరాల ప్రకారం..యువకుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. అతను నలుపు రంగు షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. చేతిపై 'ఓం' అని పచ్చబొట్టు ఉందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునారు.