ప్రశాంతంగా ముగిసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

KKD: పిఠాపురం నియోజకవర్గంలోని బుధవారం 7 పరీక్షా కేంద్రాల్లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించేందుకు ఎంట్రన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగాసింది. పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ హైస్కూల్, జూనియర్ కళాశాల, మున్సిపల్ హైస్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీచైతన్య పాఠశాల, బాదం మాధవరావు హైస్కూల్, గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహించారు.