పించ జలాశయం నుంచి నీరు విడుదల
అన్నమయ్య: పించ జలాశయంలోకి వస్తున్న నీటి ప్రవాహం పెరగడంతో శుక్రవారం జలాశయం గేటు ద్వారా నదిలోకి 1,624 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని జలాశయం ఏఈ నాగేంద్ర నాయక్ తెలిపారు. జలాశయంలోకి 1,669 క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని, కుడి కాలువకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.