పుత్తూరులో వెహికల్ ఫిట్‌నెస్ సెంటర్
TPT: పుత్తూరు నుంచి బంగారుపాళెంకు తరలించిన వెహికల్ ఫిట్‌నెస్ సెంటర్‌ను తిరిగి పుత్తూరులో ఏర్పాటు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చినట్టు టీడీపీ నేత విజయ్ బాబు తెలిపారు. సెంటర్ తరలింపుతో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.