జూరాల ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉంది: డీకే అరుణ
TG: ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ మంత్రులతో చర్చించామని ఎంపీ డీకే అరుణ తెలిపారు. సర్కార్ వచ్చి రెండేళ్లు అవుతున్నా.. పనుల్లో పురోగతి ఉండటం లేదన్నారు. జూరాల ప్రాజెక్ట్ డ్యామ్ ప్రమాదంలో ఉందని చెప్పారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్ పరిధిలోని రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.