క్రికెటర్లకు కొత్త రూల్.. ఆ పోస్టులు పెడితే కోటి ఫైన్!
పంజాబ్ సీఎం మరియం నవాజ్‌పై పాకిస్తాన్ బౌలర్ నసీం షా SMలో వివాదాస్పద పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడికి PCB రూ.2 కోట్ల జరిమానా విధించింది. రాజకీయ పోస్టులు పెట్టి నిబంధనలు ఉల్లంఘించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. ఇకపై ఆటగాళ్లు రాజకీయ అంశాలపై స్పందిస్తే కఠిన చర్యలు తప్పవని, కనీసం కోటి రూపాయల జరిమానా విధిస్తామని PCB తీవ్రంగా హెచ్చరించింది.