అమెరికాలో గుండెపోటుతో జిల్లా వాసి మృతి
WGL: అమెరికాలో జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందడంతో అతడి కుటుంబంలో విషాదం నింపింది. వివరాల ప్రకారం.. రామనాథపురి కాలనీకి చెందిన రాకేష్ గత కొంతకాలంగా అమెరికాలో నివసిస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ.. ఇవాళ కన్నుమూశాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.