ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు
PPM: రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా పాలకొండ-సీతంపేట రోడ్డులో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. డ్రైవర్లకు లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని పాలకొండ వేణుగోపాలం, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు కోరారు. అనంతరం ర్యాలీ చేపట్టారు.