రేపు పిట్లంలో సామూహిక కార్తీక దీపోత్సవం
KMR: పిట్లం మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మహిళలు సాంప్రదాయ దుస్తులలో రావాలన్నారు. పూజ కార్యక్రమం అనంతరం అన్న ప్రసాదం ఉంటుందని కమిటీ సభ్యులు ఈరోజు పేర్కొన్నారు.