VIDEO: పెరిగిన పత్తి ధర

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి రూ.7,410 ధర పలకగా.. ఈరోజు రూ.7,520 ధర వచ్చింది. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 పెరగడం సంతోషం కలిగించే విషయం. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ రైతులు సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.