చంద్రబాబు రాయలసీమకు చెడ్డ బిడ్డ: సాకే శైలజానాథ్
ATP: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తిరుపతిలో YCP జిల్లా స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా శింగనమల వైసీపీ ఇంఛార్జ్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాయలసీమకు పెద్ద బిడ్డ కాదు, చెడ్డ బిడ్డ అని విమర్శించారు. సీమ ప్రాజెక్టులు పూర్తయితే తన ఉనికి పోతుందనే భయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.